ముంబయి దాడుల విషయంలో సైన్యం చేతులను అప్పటి ప్రభుత్వం కట్టేసిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. గ్రేటర్ నోయిడాలో నాలుగో దశ మెట్రో పనులను ప్రారంభించారు ప్రధాని. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
"భారత్ కొత్త రీతి, కొత్త నీతితో నడుస్తోంది. ఉరీ దాడి తర్వాత లక్షిత దాడులతో సమాధానమిచ్చాం. ఉగ్రవాదులకు వారికి అర్థమయ్యే భాషలోనే బదులిచ్చాం. మన వీర సైనికులు ఉగ్రవాదుల ఇంట్లోకి చొరబడి వారిని హతమార్చారు. ముంబయిపై పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడులు చేశారు. పాక్లో ఉన్న ఉగ్రవాదుల ఆధారాలు దొరికాయి. విషయమేమిటంటే.. అప్పుడు మన సైన్యం ప్రతీకారానికి సిద్ధంగా ఉంది. అయితే కేంద్రం భరోసా ఇవ్వలేదు. సైన్యం కాళ్లు చేతులను కట్టేశారు. అందుకే ముంబయి దాడుల తర్వాత కూడా ఇంకా దేశంలో ఉగ్రచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'పవర్'లోనూ బలహీనమే