తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మేడ్చల్​- మల్కాజ్​గిరి ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - mlkg-counting-arrengments

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మేడ్చల్​- మల్కాజిగిరి పార్లమెంట్​ నియోజకవర్గం ఓట్లు లెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఏర్పాట్లలో నిమగ్నం

By

Published : May 21, 2019, 7:18 PM IST

మేడ్చల్​- మల్కాజి​గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్​ ఎంవీ.రెడ్డి స్పష్టం చేశారు. 7 అసెంబ్లీ నియోజక వర్గాల ఈవీఎంలను బోగారం హోలీమేరీ కళాశాలలో భద్రపరిచినట్లు తెలిపారు. మే 23న కౌంటింగ్ కోసం మొత్తం 28 రౌండ్లు... ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 34 రౌండ్లు లెక్కిస్తామని అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు నిర్వహించనున్నట్లు రాచకొండ కమిషనర్​ మహేష్​ భగవత్​ వెల్లడించారు.

ఏర్పాట్లలో నిమగ్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details