ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే ఇప్పటికే సాగునీరందేదన్నారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ఎంత ప్రవాహం ఉందో తుమ్మిడిహట్టి వద్ద కూడా అంతే ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం లిఫ్ట్‌ల భారం ప్రజలపై పడుతుందని తెలిపారు.
'కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృథా చేశారు' - జీవన్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. గుర్తింపు కోసం ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ పూర్తిచేస్తే ఇప్పటికే వినియోగంలోకి వచ్చేదని.. ఆర్భాటాల కోసం ప్రజల నెత్తిన భారం వేశారన్నారు.
'కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృథా చేశారు'
ఇవీ చూడండి: 'వట్టెం ముంపు బాధితులకు న్యాయం చేయండి'