ఖమ్మం జిల్లా కేంద్రంలో 300 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం 39వ డివిజన్‌లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి వేసిన పంపులను ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి కొబ్బరి కాయలు కొట్టి బిందెల్లో నీటిని పట్టారు. పాలేరు జలాశయం నుంచి శుద్ధి చేసిన జలాలను నగరంలోని ప్రతి ఇంటికి చేర్చటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఖమ్మంలో రూ.300 కోట్లతో మంచినీటి సరఫరా - TRS
ఖమ్మంలో ఇంటింటికి మంచినీరు సరఫరా అవుతుందని జిల్లా ఎమ్మెల్యే అజయ్ కుమార్ తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 300 కోట్లతో నీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఖమ్మంలో 300 కోట్లతో మంచినీటి సరఫరా