తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జులై 4 నుంచి భాగ్యనగరం బోనాలు - హోంమంత్రి మహమూద్​ అలీ

వచ్చే నెలలో జరగనున్న బోనాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​, ఇంద్రకరణ్​ రెడ్డి సమీక్షించారు. ఏర్పాట్లు, నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

బోనాల ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

By

Published : Jun 10, 2019, 4:43 PM IST

సచివాలయంలో అధికారులతో మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​, ఇంద్రకరణ్​రెడ్డి సమావేశమయ్యారు. వచ్చేనెలలో జరిగే బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపకల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్​ తెలిపారు. జూలై 4 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణరెడ్డి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యేలు ముఠాగోపాల్​, గోపీనాథ్​, కాలేరు వెంకటేష్​, రాజాసింగ్​ పాల్గొన్నారు. ప్రతిఏటా ఆషాడ మాసంలో భాగ్యనగరంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

బోనాల ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

ఇవీ చూడండి: వారం రోజుల్లో ఏపీ భవనాలు తెలంగాణకు

ABOUT THE AUTHOR

...view details