ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తాగు నీటి అవసరాల కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు నీరు విడుదలకు రంగం సిద్ధమైంది. 2.5 టీఎంసీల నీరివ్వడానికి అంగీకరించిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక నిర్ణయంతో గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఊరట కలుగనుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయినందున నీటిని విడుదల చేయాల్సిందిగా కుమారస్వామిని సీఎం కేసీఆర్ కోరారు. జూరాల, రామన్‌పాడు జలాశయాలు అడుగంటిపోయిన తరుణంలో... కేసీఆర్ కోరిన వెంటనే కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి... తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్‌కు తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉండాలని, ఇది ఇలాగే కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిరంజన్‌రెడ్డి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ కోరగా.. కుమార స్వామి అంగీకరించారు. రాష్ట్రాల మధ్య ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉండాలని, ఇది ఇలాగే కొనసాగాలని నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు
మంత్రి నిరంజన్‌రెడ్డి