హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ప్రతి గ్రామానికి ప్రణాళిక సిద్ధం చేసి... నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లోని తన నివాసంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు.
హరితహారంలో ప్రతి మొక్కనూ బతికించాలి: మంత్రి - Minster review meeting on haritha haaram
హైదరాబాద్ లో మంత్రి నిరంజన్ రెడ్డి... హరితహారం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామానికి ప్రణాళిక సిద్ధం చేసి... నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![హరితహారంలో ప్రతి మొక్కనూ బతికించాలి: మంత్రి Minister niranjan reddy on harithaharam program](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:50-7562111-d.jpg)
Minister niranjan reddy on harithaharam program
పంచాయతీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాక్టర్లు, ట్యాంకర్లలను అందజేసిందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలకు రూ. 338 కోట్ల నిధులు నెలనెలా వస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వివరించారు. ఉపాధి హామీ పనులను పారిశుద్ధ్యానికి, హరితహారానికి వినియోగించుకునేలా సూచనలు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం త్వరగా సాగేందుకు గ్రామపంచాయతీలు సహకరించాలన్నారు.