తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన - minister-niranjan-reddy-foundation-for-double-bed-room

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి వనపర్తిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పట్టణానికి మంజూరైన రెండు పడక గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

minister-niranjan-reddy-foundation-for-double-bed-room

By

Published : Jun 30, 2019, 7:44 PM IST

వనపర్తిలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా పట్టణ శివారులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. పార్కులు వ్యాయామ సంబంధిత పరికరాలను ప్రారంభించారు. అనంతరం శ్వేతనగర్ కాలనీలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటికే 14 వందల ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఖిల్లా గణపురం మండలం కర్ణ తండాలో 100 గృహాల నిర్మాణం పూరైందని... వచ్చే వారంలో వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తికి సంబంధించి 560 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details