తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మెక్సికో గోడ నిర్మాణానికి మార్గం సుగమం

మెక్సికో సరిహద్దులో తలపెట్టిన గోడ నిర్మాణానికి నిధుల మంజూరుతో ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు.

ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

By

Published : Feb 13, 2019, 11:32 AM IST

అమెరికా- మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణంపై నిధుల అంశంలో స్పష్టత వచ్చింది. మెక్సికో గోడ నిర్మాణానికి వ్యతిరేక స్వరాలు వినిపించిన డెమొక్రాట్, రిపబ్లికన్​ పార్టీల నేతలు నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు.

చట్టసభ సభ్యుల నిర్ణయంపై ట్రంప్​ హర్షం...

డెమొక్రట్ల నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన ధనం సమకూరనుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గోడలోని ఓ పెద్ద భాగాన్ని నిర్మిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ, తాను కోరిన 5.7 బిలియన్​ డాలర్ల కంటే చట్టసభ సభ్యులు ఆమోదించింది చాలా తక్కువగా ఉందన్నారు.

మరో షట్​డౌన్​ తలెత్తకూడదనే....

మెక్సికో సరిహద్దు వ్యవహారంతో మరోసారి ప్రభుత్వ పాక్షిక మూసివేతకు దారి తీయకుండా ఉండేందుకు ఇరు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. గోడ నిర్మాణం విషయంలో అమెరికా ప్రభుత్వానికి సహకరించాలని నిర్ణయించారు.

గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు కారణంగా 30 రోజుల పాటు సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వాదిస్తున్నారు డెమొక్రాట్లు.

గోడ నిర్మాణాన్ని గతేడాది డిసెంబర్​లో అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. ఫలితంగా, 35 రోజుల పాటు ప్రభుత్వ పాక్షిక మూసివేత కొనసాగింది. ఫిబ్రవరి 15 వరకు అవసరమైన నిధుల కేటాయింపు జరపాలని, సహకరించకపోతే మరో షట్​డౌన్​ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్​ హెచ్చరించిన నేపథ్యంలో నిధులకు ఆమోదం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details