చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇష్టాగోష్ఠిలో పాల్గొననున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత్‌లో జరగబోయే ఈ సమావేశానికి సంబంధించి అధికారికంగా తేదీ, వేదిక ఇంకా నిర్ణయించలేదని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఇరు దేశాలు ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు.
త్వరలో మోదీ, జిన్ పింగ్ భేటీ... - china
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ జరిగే వేదిక, అధికారిక తేదీ నిర్ణయించాల్సి ఉందని విదేశీ వ్యవహారాల కార్యాలయం తెలిపింది.
త్వరలో మోదీ, జిన్ పింగ్ భేటీ...
గతేడాది చైనాలోని వుహాన్‌లో మోదీ, జిన్‌పింగ్ మొదటిసారి ఇష్టాగోష్ఠి శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. అప్పటికీ డోక్లాం వివాదం తలెత్తి కొద్ది నెలలే అయింది. సరిహద్దులో పరస్పరం సహకారం అందించుకోవాలని అప్పట్లో ఇరు దేశాల బలగాలకు సూచించారు మోదీ, జిన్‌పింగ్. 2019లో మరోసారి సమావేశం అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్‌పై నేరం మోపలేం: ముల్లర్