తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మధ్యంతర బడ్జెట్​కు లోక్​సభ ఆమోదం

2019-20 కేంద్ర మధ్యంతర బడ్జెట్​కు లోక్​సభ ఆమోదం తెలిపింది

మధ్యంతర బడ్జెట్​కు లోక్​సభ ఆమోదం

By

Published : Feb 11, 2019, 9:49 PM IST

2019-20 మధ్యంతర బడ్జెట్​కు లోక్​సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్​, సీపీఐ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో మెజారిటీ సభ్యులు బడ్జెట్​కు అనుకూలంగా ఓటేసినందున స్పీకర్​ బడ్జెట్​కు ఆమోదముద్ర వేశారు.

ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్​, సీపీఐ, ఎన్​సీపీ పార్టీల ఎంపీలు సభనుంచి వాకౌట్​ చేశారు.

కాంగ్రెస్​ సభ్యుల తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​​ మండిపడ్డారు. బడ్జెట్​కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దాల మేడల్లో నివసించే వారికి రూ.2 వేల విలువ తెలియదు, అందుకే 'ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్ నిధి' పథకాన్ని చులకన చేసి మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.

" గత నాలుగున్నరేళ్లుగా పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. 2019-20 మధ్యంతర బడ్జెట్​ వారి అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది. కాంగ్రెస్​తో పోలిస్తే మా ప్రభుత్వ పని తీరు చాలా భిన్నంగా ఉంది. మోదీ ప్రభుత్వం నిజాయతీగా పనిచేస్తోంది. దేశంలోని నకిలీ సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది. నిజాయతీ పరులను రక్షించడానికి మా ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తోంది."
-పీయూష్ గోయల్​, కేంద్ర ఆర్థిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details