సుప్రీంకోర్టులో మాయావతికి చుక్కెదురైంది. బీఎస్పీ హయాంలో తనతో పాటు తన పార్టీ చిహ్నమైన ఏనుగు విగ్రహాలను లఖ్‌నవూ, నోయిడా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మాయావతి. దీనికి వినియోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని బీఎస్పీ అధ్యక్షురాలిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
విగ్రహాల సొమ్ము జమ చేయాల్సిందే: సుప్రీం - విగ్రహాలు
బీఎస్పీ పాలనలో తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న మాయావతి ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది
విగ్రహాల సొమ్ము జమ చేయాల్సిందే: సుప్రీం
సొంత విగ్రహాలు నిర్మించుకోవడానికి ప్రజాధనాన్ని వినియోగించకూడదని దాఖలైన పిటషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విగ్రహాల కోసం వాడిన సొమ్మును మాయావతి జమ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగొయి తెలిపారు. తుది విచారణ ఏప్రిల్ 12కు వాయిదా పడింది.
Last Updated : Feb 8, 2019, 4:49 PM IST