తెలంగాణ

telangana

ETV Bharat / briefs

చెన్నై విజయ లక్ష్యం 148 పరుగులు

దిల్లీలో జరుగుతున్న మ్యాచ్​లో 148 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు ముందుంచింది దిల్లీ క్యాపిటల్స్.

చెన్నె సూపర్ కింగ్స్ జట్టు

By

Published : Mar 26, 2019, 9:51 PM IST

Updated : Mar 26, 2019, 9:58 PM IST

దిల్లీ వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్యాపిటల్స్ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించింది. పృథ్వీ షా మొదట్లో ధాటిగా ఆడి 16 బంతుల్లో 24 పరుగుల చేశాక అవుటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18)ను తాహిర్ పెవిలియన్​కు పంపాడు. పంత్ (25) కాసేపు బ్యాట్​కి పనిచెప్పాడు. ఆ తర్వాత బ్రావో బౌలింగ్​లో భారీ షాట్​కి ప్రయత్నించి వెనుదిరిగాడు.

మెరిసిన ధావన్

ఓ వైపు వికెట్లు పడుతున్నా ధావన్ మాత్రం నెమ్మదిగా ఆడాడు. ముంబయి మ్యాచ్​లో 43 పరుగులతో ఆకట్టుకున్న ధావన్ ఈ మ్యాచ్​లో 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అనంతరం భారీ షాట్ ఆడబోయి బ్రావో బౌలింగ్ అవుటయ్యాడు.

చెన్నై బౌలర్లు భళా

పరుగులను కట్టడి చేస్తూ దిల్లీ బ్యాట్స్​మెన్​పై ఒత్తిడి పెంచి వికెట్లు సాధించారు చెన్నై బౌలర్లు. వారి ధాటికి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు దిల్లీ బ్యాట్స్​మెన్. బ్రావో 3 వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, తాహిర్ చెరో వికెట్ తీశారు.

Last Updated : Mar 26, 2019, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details