ఒకే రోజు మూడు కాలాల దృశ్యం కనువిందు చేసిన ప్రకృతి అందం... విశాఖ మన్యం పాడేరు వాసులకు ఉల్లాసాన్ని పంచింది. వారం రోజులుగా ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం... ఇలా విభిన్న వాతావరణం ప్రజల్ని అబ్బురపరుస్తోంది. ఉదయం 9గంటల వరకు ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలకు పడిపోయి పొగమంచు కురుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వేసవి తాపం 36 డిగ్రీల వరకు చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రం మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒకే రోజు మూడు కాలాల సమ్మేళనం మన్యం ప్రకృతి సోయగానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మన్యం అందం.. ఒకే రోజు మూడు కాలాల రమణీయ దృశ్యం - visakha agency
విశాఖ మన్యం పాడేరులో ఒకే రోజు మూడు కాలాల దృశ్యం కనువిందు చేసింది. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తూ మన్యం వాసులను... అక్కడి వాతావరణం అబ్బురపరిచింది.
manyam weather