తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత షూటర్లు - ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత షూటర్లు మను బాకర్- సౌరభ్ వర్మ

తైవాన్​లో జరుగుతున్న ఎయిర్​గన్ ఛాంపియన్​షిప్ అర్హత రౌండ్​లో భారత షూటర్లు అరుదైన ఘనత సాధించారు. 784 పాయింట్లు సాధించిన మను బాకర్-సౌరభ్ చౌదరి జోడి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత షూటర్లు

By

Published : Mar 27, 2019, 5:14 PM IST

నెల రోజుల క్రితం దిల్లీలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్​లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది సౌరభ్-మనుద్వయం. ప్రస్తుతం తైవాన్​లో జరుగుతున్న ఆసియన్ ఎయిర్ గన్ ఛాంపియన్​షిప్​ అర్హత రౌండ్​లో 784 పాయింట్లు సాధించారు. తద్వారా... యూరోపియన్​ ఛాంపియన్​షిప్​లో ఐదు రోజుల క్రితం నమోదైన రికార్డును తిరగరాశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్​డ్ టీం విభాగంలో బంగారు పతకం సాధించారు.

ఐదు జట్లు పాల్గొన్న ఈ ఛాంపియన్​షిప్ తుదిపోరులో 484.4 పాయింట్లు సాధించిన సౌరభ్-మను ద్వయం బంగారు పతకం సాధించింది.

481.1 పాయింట్లతో కొరియా షూటర్లు.. హ్వాంగ్-కిమ్ జోడి వెండి పతాకాన్ని గెలుపొందారు.

భారత్ తరఫున ఫైనల్​లో పాల్గొన్న మరో జోడి అనురాధ-అభిషేక్ వర్మ.. 372.1 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details