తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మన ప్రాంతం... మన పాఠశాల - మన ప్రాంతం... మన పాఠశాల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ఒక్కప్పుడు గద్వాల జిల్లా వాసులు నాణ్యమైన విద్య కోసం కర్నూల్​ నగరానికి వెళ్లేవారు. ప్రస్తుతం రాష్ట్రం ఏర్పాటు అయ్యాక జిల్లాలో మంచి ప్రైవేట్ పాఠశాలలు రావటం వల్ల వారికి కర్నూల్ వెళ్లే అవసరం తప్పింది. అలంపూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ పాఠశాలను రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

అలంపూర్ చౌరస్తాలో ప్రైవేట్ పాఠశాలను ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి

By

Published : Apr 17, 2019, 11:06 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్​తో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పాఠశాల ఏర్పాటు కావటం వల్ల కర్నూల్​ వెళ్లే పరిస్థితి ఇక లేదని పేర్కొన్నారు. గతంలో అక్కడ చదువుకోవడం వల్ల స్థానికత సమస్య ఉత్పన్నమయ్యేదని వెల్లడించారు.

అలంపూర్ చౌరస్తాలో ప్రైవేట్ పాఠశాలను ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details