ఎస్సీల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పంజాగుట్టలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అనుమతి లేకున్నా ఉంచారని, అంబేడ్కర్ విగ్రహానికి అనుమతి లేదని ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
'కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారు' - mros
అంబేడ్కర్ జయంతి రోజున సీఎం కేసీఆర్ పాల్గొనకుండా రాజ్యాంగ నిర్మాతను అవమానించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సీఎం తీరును నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

mandakrishna
ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసన...
ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈనెల 22 వరకు చేపడతామన్నారు. 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు.
'కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారు'