ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు చిన్నారుల సహా.. ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. మృతులు పాలకొల్లు వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి పాలకొల్లు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న కారు... ఐదుగురు మృతి - ఐదుగురు మృతి
ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన తెల్లవారు జామున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో చోటుచేసుకుంది.
ఐదుగురు మృతి