తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రైల్వే టీ కప్పులపై 'చౌకీదార్'​ రగడ - TEA

'మైబీ చౌకీదార్' (నేనూ కాపలాదారే​) నినాదం రైల్వేశాఖ టీ కప్పులపై దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. ప్రయాణికుల ఫిర్యాదుతో రైల్వేశాఖ చర్యలు తీసుకుంది.

టీ కప్పులపైనా 'మైబీ చౌకీదార్'​ ప్రచారం!

By

Published : Mar 30, 2019, 6:56 AM IST

టీ కప్పులపైనా 'మైబీ చౌకీదార్'​ ప్రచారం!
లోక్​సభ ఎన్నికల్లో భాజపా 'మైబీ చౌకీదార్'​ నినాదాన్ని ఓ అస్త్రంగా ఎంచుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా నాయకులు పేర్లకు ముందు చౌకీదార్​ను తగిలించుకున్నారు. అలాంటి రాజకీయ నినాదం... రైళ్లలో టీ కప్పులపై దర్శనమిచ్చింది.

ప్రయాణికులు కొంత మంది ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా... రైల్వేశాఖ స్పందించింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది.

టీ కప్పులపై చౌకీదార్​ నినాదం ముద్రణకు ఐఆర్​సీటీసీ అనుమతి లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు బాధ్యుడైన గుత్తేదారుకు రూ. లక్ష జరిమానా విధించింది. షోకాజ్​ నోటీసు జారీ చేసింది.

రెండోసారి..

కొద్ది రోజుల క్రితం రైల్వేశాఖ టికెట్లపై ప్రధాని మోదీ చిత్రాన్ని ముద్రించడం వివాదాస్పదమైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ తప్పు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని రైల్వేశాఖ వివరణిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details