టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబానికి చాలా విలువ ఇస్తారనే సంగతి తెలిసిందే. "ఇల్లు బాగుంటే మనం బాగుంటాం.. షూటింగ్‌లో కష్టపడిన అనంతరం ఇంటికి వెళితే ప్రశాంత వాతావరణం ఉండాలి.. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ని..." అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవటం వల్ల ఆయన తన సమయాన్ని పిల్లలు గౌతమ్, సితారలతో ఆనందంగా గడుపుతున్నారు. మరి ఈ 'శ్రీమంతుడు' ఇంట్లో లేనప్పుడు ఎక్కడ ఉంటారనే విషయాన్ని ఆయన సతీమణి నమ్రత... అభిమానులతో పంచుకున్నారు.
మహేశ్ తమతో లేకుంటే... ఆయనకు ఎంతో ఇష్టమైన చోట ఉన్నట్టే అని ఆమె అన్నారు. అయితే అది ఏ సినిమా సెట్టో కాకుండా.. మహేష్ చాలా ఇష్టమైన ప్రదేశమని.. ముద్దుగా లయన్స్ డెన్ (సింహం గుహ) అని పిలుస్తానని చెప్పారు. అదే మహేశ్ సొంత జిమ్ అని తెలిపారు.