తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'గెలిచి చూపించడం నాకు అలవాటు' - mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'మహర్షి'. ఉగాది కానుకగా చిత్ర టీజర్​ విడుదల చేశారు.

మహర్షి టీజర్​తో అదరగొడుతున్న మహేశ్ బాబు

By

Published : Apr 6, 2019, 10:01 AM IST

సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మహర్షి' టీజర్ వచ్చేసింది. స్టైలిష్ లుక్​లో మహేశ్ బాబు అదరగొడుతున్నాడు. బిలియనీర్​, స్టూడెంట్.. ఇలా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.

'సక్సెస్​లో పుల్​స్టాపులు ఉండవు కామాస్ మాత్రమే ఉంటాయి', 'ఎవడైనా నువ్వు ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు' అని మహేశ్ చెప్పిన డైలాగ్​లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తుండగా, అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

దిల్​రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details