తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పండక్కి మహేశ్​బాబు సందడి - మహేశ్​బాబు

ఉగాది(ఏప్రిల్ 6) రోజున మహేశ్​బాబు 'మహర్షి' టీజర్​ విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రంలో సూపర్​స్టార్ రెండు పాత్రల్లో సందడి చేయనున్నాడని తెలుస్తోంది.

ఉగాదికి రానున్న మహర్షి సినిమా టీజర్

By

Published : Mar 19, 2019, 5:37 PM IST

Updated : Mar 19, 2019, 9:01 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు పండెక్కి సందడి చేయనున్నాడు. మొదట ఉగాదికే 'మహర్షి' సినిమాను రిలీజ్ చేద్దామని భావించినా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు అదే రోజున సినిమా టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మే 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఇది వరకే నిర్మాత దిల్​రాజు ప్రకటించారు. మహేష్ పుట్టినరోజు కానుకగా ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకోనుంది. ఎన్నికల అనంతరం ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో హీరో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.

పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తుండగా, అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.



Last Updated : Mar 19, 2019, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details