రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్లో దారుణ హత్య జరిగింది. కొరివి యాదయ్య(48)ను నిన్న రాత్రి పదింటికి మేకల మంద వద్దకు వెళ్తుండగా... గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో నరికి చంపారు. మృతదేహాన్ని డొంక దారిలో పడేశారు. విషయం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇబ్రహీంపట్నంలో దారుణ హత్య - ఇబ్రహీంపట్నం
మేకల మంద వద్దకు వెళ్తున్న వ్యక్తిని మాటు వేసి మారణాయుధాలతో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దారుణం ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.
మాటు వేశారు... మట్టుబెట్టారు