మధ్యప్రదేశ్ ఝబువా జిల్లా దేవీగఢ్ గ్రామంలో ఓ వివాహితను ఊరి పెద్దలు అందరి ముందు అవమానించారు. వేరే కులానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణే ఇందుకు కారణం. తప్పు చేసినందుకు శిక్షగా ఆమె తన భర్తను మోయాల్సిందిగా బలవంతం చేశారు. చేసేది లేక ఆ యువతి శిక్షకు అంగీకరించింది. భర్తను భుజాలపై కొద్ది దూరం మోసింది.
అక్రమ సంబంధముందని ఆలికి విచిత్ర శిక్ష - MP
మధ్యప్రదేశ్ ఝబువా జిల్లా దేవీగఢ్ గ్రామంలో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణపై ఓ వివాహితకు అమానుష శిక్ష విధించారు గ్రామపెద్దలు. ఆమె తన భర్తను భుజాలపై మోయాలని ఆదేశించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.
నవ వధువును అవమానించిన కట్టుబాటు!
ఈ అమానుష ఘటనను అందరూ ప్రత్యక్షంగా తిలకించారే తప్ప.. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. కొందరు ఈలలూ.. డ్యాన్సులు వేస్తూ ఆనందించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Last Updated : Apr 14, 2019, 2:43 PM IST