ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటూ రామయ్య కల్యాణం చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
బ్రిస్బేన్లో కన్నులపండువగా శ్రీరామ కల్యాణ వేడుకలు - lord Rama marriage ceremony in Australia
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో సీతారాముల కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. దేశంలో కరోనా మహమ్మారి జడలు చాస్తున్నందున ప్రజలను కాపాడాలని స్వామిని కోరుకున్నట్లు బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
సీతారాముల కల్యాణం, ఆస్ట్రేలియాలో సీతారాముల కల్యాణం, బ్రిస్బన్లో సీతారాముల కల్యాణం
బ్రిస్బేన్ నగరంలోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ బ్రిస్బేన్ సభ్యులు రాములవారికి కిలో వెండి కానుకగా సమర్పించారు. కరోనా విముక్తి ప్రపంచం త్వరలోనే రావాలని స్వామిని వేడుకున్నట్లు సభ్యులు చెప్పారు.
- ఇదీ చదవండిఈటల వ్యవహారం సీఎం పరిధిలో ఉంది: తలసాని