తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"లోక్​పాల్​ అమలైతే రఫేల్​లో ప్రధాన నిందితుడు మోదీనే" - నరేంద్ర మోదీ

లోక్​పాల్​ అమలైతే రఫేల్​ కుంభకోణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ప్రధాన నిందితుడవుతారని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు వీరప్ప మొయిలీ విమర్శించారు.

రఫేల్​లో ప్రధాన నిందితుడు మోదీనే

By

Published : Feb 11, 2019, 7:47 PM IST

పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల్లో రఫేల్​ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత వీరప్ప మొయిలీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై లోక్​సభలో విమర్శలు చేశారు. రఫేల్​ కుంభకోణంలో మోదీనే ప్రధాన నిందితుడని ఆరోపించారు. ఇటీవల రఫేల్​ కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు.

రఫేల్​లో ప్రధాన నిందితుడు మోదీనే

" రఫేల్​ కుంభకోణంలో ఎవరైనా దోషిగా తేలుతారంటే.. అది ప్రధాని ఒక్కరే. లోక్​పాల్​ బిల్లును ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?. ఇప్పుడు అది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే లోక్​పాల్​ అమలైతే ప్రధాని మోదీనే ప్రధాన నిందితుడవుతారు. అవినీతి బుల్లెట్​ తగిలితే మోదీ దానిని భరించలేరు"

- వీరప్ప మొయిలీ

ABOUT THE AUTHOR

...view details