తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పాక్​పై భారత్​ గెలుపు.. పేస్​ ఖాతాలో 44వ విజయం - పాకిస్థాన్

కజకిస్థాన్​లోని నూర్‌ సుల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న డెవిస్‌కప్‌ పోరులో భారత్‌ దూసుకెళ్తోంది. ఈ టోర్నీలో ఫేవరెట్​గా బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు.. తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. డబుల్స్‌లో పేస్‌, నెదుంచెజియన్‌ ద్వయం.. హుఫైజా-షోయబ్‌ జోడీతో తలపడి విజయం సాధించింది.

Leander Paes
పేస్

By

Published : Nov 30, 2019, 2:29 PM IST

Updated : Nov 30, 2019, 6:38 PM IST

నూర్‌ సుల్తాన్‌లో పాకిస్థాన్‌తో డెవిస్‌కప్‌ పోరును ఘనంగా కొనసాగిస్తోంది భారత్​. ఐదు మ్యాచ్​ల్లో ఇప్పటికే 2-0 ఆధిక్యంతో ఉన్న భారత జట్టు.. శనివారం జరిగిన డబుల్స్​ మ్యాచ్​లో విజయం సాధించింది. డబుల్స్‌లో పేస్‌, నెదుంచెజియన్‌ ద్వయం 6-1, 6-3 తేడాతో హుఫైజా-షోయబ్‌ జోడీని ఓడించింది.

ఈ తాజా గెలుపుతో ఆధిక్యాన్ని 3-0కు పెంచుకున్నారు భారత ఆటగాళ్లు. అదే కాకుండా కెరీర్​లో 44వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు లియాండర్​ పేస్​. డెవిస్​ కప్​లో తన అత్యధిక విజయాల రికార్డును తనే బ్రేక్​ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటలీ దిగ్గజ ఆటగాడు నికోలా(66 టై, 42 విజయాలు) రికార్డును అధిగమించాడు. పేస్ ప్రస్తుతం​ 56 టై, 44 విజయాలతో ఉన్నాడు.

ఇంతకుముందు...

తొలి రోజైన శుక్రవారం సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో సుమిత్‌ నగాల్‌, రామ్‌కుమార్‌ రామనాథన్‌లు అనుభవం లేని పాక్‌ ప్రత్యర్థులపై అలవోకగా గెలిచారు. కేవలం 42 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-0, 6-0తో మహ్మద్‌ షోయబ్‌ను చిత్తు చేశాడు. రెండో సింగిల్స్‌లో సుమిత్‌ 6-0, 6-2తో అబ్దుల్‌ రెహ్మన్‌ను మట్టికరిపించాడు. నాలుగో మ్యాచ్‌ ( రివర్స్​ సింగిల్స్‌) నేడు జరగనుంది. ఐదో మ్యాచ్‌ ఆడాలో వద్దో జట్లు నిర్ణయించుకోవచ్చు. గతంలో పాకిస్థాన్‌తో తలపడ్డ ఆరుసార్లూ భారత జట్టే గెలిచింది.

ఇవీ చూడండి.. పాకిస్థాన్​పై భారత్​ విజయం.. 2-0తో ఆధిక్యం

Last Updated : Nov 30, 2019, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details