సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు వేతనాలు అందడం లేదని ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదంటూ... సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వేతనాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం' - సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 10వ తేదీలోపు వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
!['వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2883026-416-1221747e-fb11-4228-9ba2-267bb7eb6759.jpg)
'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం'
'వేతనాలు అందకపోతే... ఆందోళన ఉద్ధృతం'
దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ వేమనా రెడ్డి రెండు నెలల వేతనాలు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో వేశామని స్పష్టం చేశారు. ఏడాది ముగింపు మార్చి నెల కావడం వల్ల వారికి చేరుకోవడం ఆలస్యమైందని తెలిపారు. మరో రెండు రోజుల్లో అందుతాయని వారికి హామీనిచ్చారు.
ఈనెల 10వ తేదీలోపు వేతనాలు అందకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘ నాయకులు హెచ్చరించారు.