తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రబాడ యార్కర్లకు..గేల్ సిక్స్​లు కొడతాడా..!

నేడు మొహాలీ వేదికగా పంజాబ్-దిల్లీ జట్ల మధ్య ఐపీఎల్​ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్​లో గెలిచిన ఇరుజట్లు అదే ఊపు కొనసాగించాలని చూస్తున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్​ ఆరంభం కానుంది.

మొహాలీ వేదికగా పంజాబ్-దిల్లీ జట్ల మధ్య పోరు

By

Published : Apr 1, 2019, 7:00 AM IST

కోల్​కతాతో మ్యాచ్​లో అద్భుతమైన యార్కర్ వేసిన దిల్లీ బౌలర్ రబాడ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు వాటికి దీటైన సమాధానమిచ్చేందుకు పంజాబ్ బ్యాట్స్​మెన్ సిద్ధమవుతున్నారు. మొహలీ వేదికగా జరిగే నేటి ఐపీఎల్ మ్యాచ్​లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్​లో అందరి దృష్టి ప్రధానంగా రబాడపైనే ఉండనుంది. ప్రత్యర్థి జట్టులో గేల్, రాహుల్, మయాంక్ లాంటి ఫామ్​లో ఉన్న బ్యాట్స్​మెన్​ని ఎలా అడ్డుకుంటాడా అని అభిమానులు చూస్తున్నారు.

శనివారం జరిగిన మ్యాచ్​లలో రెండు జట్లు వేర్వేరుగా విజయాలు నమోదు చేశాయి. ఇరుజట్లలోని ఓపెనర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి.

బ్యాటింగ్​లో బలంగా దిల్లీ...

కోల్​కతాతో మ్యాచ్​లో కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్న దిల్లీ ఓపెనర్​ పృథ్వీషా మరోసారి చెలరెగేందుకు సిద్ధమవుతున్నాడు.ఇతర బ్యాట్స్​మెన్లలో పంత్, శ్రేయస్ అయ్యర్, ధావన్, ఇంగ్రామ్ మరోసారి బ్యాట్​కు పనిచెపితే ప్రత్యర్థి ముందు భారీ స్కోరు విధించే అవకాశముంది. దిల్లీ బౌలర్లలో రబాడ, హర్షల్ పటేల్, సందీప్ లామిచానె, బౌల్డ్, ఇషాంత్.. తమ వైవిధ్యమైన బంతులతో పరుగులు నియంత్రిస్తూ ఆకట్టుకుంటున్నారు.

పంజాబ్​లో గేల్, మయాంక్​....

పంజాబ్ బ్యాట్స్​మెన్ల​లో రాహుల్, గేల్, మయాంక్.. సొంతగడ్డపై అలరించేందుకు రెడీ అవుతున్నారు. మంచి ఫామ్​లో ఉన్న వీరిపైనే కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఆశలు పెట్టుకుంది.బౌలర్లలో మురుగన్ అశ్విన్, షమి, టై, విజిలెన్ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్ పనిపట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

జట్లు (అంచనా)

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), గేల్, రాహుల్, షమి, మయాంక్ అగర్వాల్, మిల్లర్, విలిజెన్, సర్ఫరాజ్ ఖాన్,మురుగన్ అశ్విన్, ఆండ్రూ టై, మన్దీప్ సింగ్.

దిల్లీ క్యాపిటల్స్:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, ధావన్, పంత్, హనుమ విహారి, ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, సందీప్ లామిచానె, హర్షల్ పటేల్, బౌల్ట్, అమిత్ మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ

ABOUT THE AUTHOR

...view details