తెలంగాణ

telangana

ETV Bharat / briefs

చికిత్స పొందుతూ ద్విచక్రవాహనదారుడు మృతి - కర్నూలు జిల్లా కలెక్టర్

వెల్దుర్తి ప్రమాద క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతుల బంధువుల ఆవేదన రోదనతో ఆసుపత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

kurnool-collector

By

Published : May 11, 2019, 11:40 PM IST

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా... వాారికి కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. వాహన వేగాన్ని అదుపులో ఉంచుకుని... ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడే ప్రమాదాలు నివారించగలుగుతామన్నారు.

క్షతగాత్రులను పరామర్శించిన కర్నూలు కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details