తెలంగాణ

telangana

ETV Bharat / briefs

యురేనియం తవ్వకాలకు కలెక్టర్ ఆదేశాలు - కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో యురేనియం ఖనిజాన్వేషణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని మూడు మండలాల్లో కోర్​ డ్రిల్లింగు... రెండు నియోజకవర్గాల పరిధిలో భౌగోళిక మ్యాపింగ్, సర్వే నిర్వహించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

kurnool-collector-orders-for-uranium-mining-at-kurnool-district
యురేనియం తవ్వకాలకు కలెక్టర్ ఆదేశాలు

By

Published : Dec 17, 2019, 10:50 AM IST

Updated : Dec 17, 2019, 11:51 AM IST

ఖనిజాన్వేషణకు నిర్వహించే కోర్​ డ్రిల్లింగ్​కు ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో మరోసారి అనుమతులు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ నుంచి ఆళ్లగడ్డ, నంద్యాల, రుద్రవరం, ఆత్మకూరు మండలాల తహసీల్దార్​లకు గత నెల23న ఆదేశాలందాయి. వీటిని 'ఈటీవీ భారత్' సోమవారం సంపాదించింది.

ఆళ్లగడ్డ, నంద్యాల, రుద్రవరం మండలాల పరిధిలో యురేనియం ఖనిజాన్వేషణకు కోర్ డ్రిల్లింగు... నంద్యాల, ఆళ్లగడ్డ, నియోజవర్గ పరిధిలో సమగ్ర సర్వే, భౌగోళిక మ్యాపింగ్​ నిర్వహించనున్నారని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు, వెంకటాపురం, నారాయణపురం, పరిధిలో పర్యవేక్షణతో కూడిన సర్వే, భౌగోళిక మ్యాపింగ్ నిర్వహించనున్నారు. యురేనియం తవ్వకాలపై ఇప్పటికే జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా మళ్లీ ఆదేశాలు రావటంతో గ్రామీణులు భయపడుతున్నారు.

యురేనియం తవ్వకాలకు కలెక్టర్ ఆదేశాలు

ఇదీ చదవండి: ఆరోగ్య పథకానికీ.. అవినీతి రోగం

Last Updated : Dec 17, 2019, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details