ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించుకుంటున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రలోనే జూన్ 21 సువర్ణాక్షరంగా నిలుస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేసుకోవడం గర్వకారణమని ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు సంబురాల్లో కేటీఆర్ పాల్గొంటారు.
'జూన్ 21 రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు' - tweet
మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కాసేపట్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతోంది. దీనిపట్ల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ట్విట్టర్లో స్పందించిన కేటీఆర్