తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'అబద్దాలు తేలిపోయాయి... న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది' - అబద్దాలు తేలిపోయాయి... న్యాయం గెలిచింది: మంత్రి కేటీఆర్

ఫామ్ హౌస్ విషయంలో ఎంజీటీ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇవ్వటం మీద మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. అబద్దాలు తేలిపోయాయని... న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

'అబద్దాలు తేలిపోయాయి... న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది'
'అబద్దాలు తేలిపోయాయి... న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది'

By

Published : Jun 10, 2020, 11:26 PM IST

జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఎంజీటీ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. అసత్యాలతో రాజకీయ ప్రత్యర్థి పిటిషన్ వేశారని... న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని తెలిపారు.

జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఎంజీటీ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఉత్తర్వులపై స్టే విధించింది.

ABOUT THE AUTHOR

...view details