నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి విషజ్వరాలతో వణికిపోతోంది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు జ్వరం కారణంగా మృతి చెందడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. నాలుగేళ్ల చిన్నారి సౌమ్య, పదకొండేళ్ల అబ్బాయి ప్రణయ్ విషజ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో వైద్య బృందం పర్యటించి 39 మంది రక్త నమూనాలను జిల్లా కేంద్రానికి తరలించారు. మలేరియా సోకి చనిపోయారా లేక ఇంకా ఏదైనా వ్యాధితో మరణించారా అన్నది వైద్యులు తేల్చాల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు. కొంత మంది తమ పిల్లలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు అధికారులు.
విషజ్వరాలతో వణికిపోతోన్న కొత్తపల్లి - kottapalli trembling with viral fevers till now two child died
అప్పటి వరకు భాగానే ఆడుకున్న చిన్నారులు కోడిపిల్లల్ల మంచాన పడుతున్నారు. ఏమైందని తెలుసుకునేలోపే ఇద్దరు చిన్నారులు ప్రాణాలొదిలారు. విషజ్వరాలుగా తెలుసుకుని తమ పిల్లల్ని రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామస్థులు.

kottapalli trembling with viral fevers till now two child died