తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'పెద్ద గాయమేం కాదు.. టెస్టులు ఆడతాను' - test

విండీస్​తో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ బొటన వేలికి గాయమైంది. అయితే అది అంత తీవ్రమైంది కాదని తెలిపాడు టీమిండియా సారథి. ఆగస్టు 22న ప్రారంభం కాబోయే తొలి టెస్టుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు.

విరాట్

By

Published : Aug 15, 2019, 11:51 AM IST

Updated : Sep 27, 2019, 2:09 AM IST

వెస్టిండీస్​తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్​లో విరాట్ బొటన వేలికి గాయమైంది. ఈ కారణంగా విండీస్​తో టెస్టు సిరీస్​కు అందుబాటులో ఉంటాడో లేదో అని అభిమానుల్లో ఆందోళన తలెత్తింది. అయితే అది అంత తీవ్రమైంది కాదని, టెస్టు సిరీస్​కు అందుబాటులో ఉంటానని తెలిపాడు కోహ్లీ.

"విండీస్​తో మ్యాచ్​లో బొటన వేలికి గాయమైంది. అయితే అది తీవ్రమైంది కాదు. గోరు లేచింది అంతే. అదృష్టవశాత్తు విరగలేదు. అంత పెద్ద గాయమైతే నేను బ్యాటింగ్ కొనసాగించేవాడినే కాదు. విండీస్​తో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉంటా." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా డక్​వర్త్​ లూయిస్ ప్రకారం ఫలితం తేల్చారు. ఈ మ్యాచ్​లో కోహ్లీ 99 బంతుల్లో 114 పరుగులు చేసి కెరీర్​లో 43వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ఆగస్టు 22 నుంచి రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఇప్పటికే 3-0 తేడాతో టీ-20 సిరీస్​, 2-0 తేడాతో వన్డే సిరీస్​ కైవసం చేసుకుంది భారత్.

ఇది చదవండి: మాస్టర్​ మాట: 'బాల భారతమే భాగ్య భారతం'

Last Updated : Sep 27, 2019, 2:09 AM IST

ABOUT THE AUTHOR

...view details