తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మయాంక్​... 'ట్రిపుల్'​ కొట్టేయాలి మరి: కోహ్లీ

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో డబుల్ సెంచరీ పూర్తికాగానే డ్రెస్సింగ్ రూమ్​లోని విరాట్ వైపు.. రెండు వేళ్లు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు మయాంక్ అగర్వాల్. చిరునవ్వుతో కోహ్లీ మూడు వేళ్లు చూపిస్తూ.. ట్రిపుల్​ కొట్టాలన్నట్లు మయాంక్​ను కవ్వించాడు.

మయాంక్ -విరాట్

By

Published : Nov 15, 2019, 9:49 PM IST

Updated : Nov 15, 2019, 9:57 PM IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో రెండో రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(243; 330 బంతుల్లో) ద్విశతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే డబుల్ సెంచరీ పూర్తయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో ఉన్న విరాట్ వైపు రెండు వేళ్లు చూపిస్తూ.. ద్విశతకాన్ని గుర్తు చేశాడు మయాంక్. ప్రతిగా కోహ్లీ చిరునవ్వుతో మూడు వేళ్లు చూపిస్తూ.. ట్రిపుల్​ సెంచరీ కొట్టాలన్నట్లు సంజ్ఞలు చేశాడు.

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ద్విశతకం (215) బాదిన మయాంక్‌ ఆ తర్వాతా అదే జోరు కొనసాగించాడు. చివరి నాలుగు టెస్టుల్లో 215, 7; 108; 200*తో చెలరేగాడు. రెండో డబుల్‌ సెంచరీ చేయడానికి మయాంక్‌ తీసుకున్నది కేవలం 12 ఇన్నింగ్స్​లే కావడం విశేషం.

అయితే బంగ్లాతో మ్యాచ్​లో త్రిశతకం చేయాలన్న కసితో భారీ సిక్సర్లు బాదడం మొదలు పెట్టిన మయాంక్‌ వ్యక్తిగత స్కోరు 243 వద్ద ఔటయ్యాడు. మెహదీ హసన్‌ వేసిన 107వ ఓవర్​ మూడో బంతికి అబు జాయేద్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

ఇదీ చదవండి: బ్రాడ్​మన్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్

Last Updated : Nov 15, 2019, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details