రాష్ట్రంలోని సమస్యల నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తిరుగుతున్నారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ అభిప్రాయపడ్డారు. సమాఖ్య కూటమి అనేది సాధ్యం కాదని... నిలదొక్కుకోలేదని తెలిపారు. దిల్లీలో ఇప్పటికే ఒక సమూహం ఏర్పడిందని... ఓట్ల లెక్కింపు తర్వాత మహా ఘట్బంధన్ క్రియాశీల పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా, కాంగ్రెస్ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కోదండరామ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని హితవు పలికారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద తెజస, సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు.
సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఫెడరల్ ఫ్రంట్ - kodandaram-1-1
రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇప్పటికీ విడుదల కాలేదు. ఇంటర్ జవాబుపత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే పట్టించుకోకుండా... ఫెడరల్ ఫ్రంట్ అంటూ... ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాలు తిరగటం సరైనది కాదు : తెజస అధినేత కోదండరాం.
![సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఫెడరల్ ఫ్రంట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3242630-thumbnail-3x2-ppp.jpg)
సమస్యలపై దృష్టి పెట్టండి
Last Updated : May 10, 2019, 4:49 PM IST
TAGGED:
kodandaram-1-1