తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అర్ధరాత్రి పిల్లలు మాయం.. నా భార్యే ఎత్తుకెళ్లిందేమో.. - police

ఆదివారం అర్ధరాత్రి నుంచి తన పిల్లలు కనిపించకుండా పోయారని.. తన భార్యే ఎత్తుకెళ్లుంటుందని అనుమానం వ్యక్తం చేశాడు ఓ భర్త.

నా భార్యే ఎత్తుకెళ్లిందేమో..

By

Published : May 13, 2019, 3:39 PM IST

అర్ధరాత్రి నుంచి తన ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి సంగారెడ్డి బీడీఎల్ భానూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. నాగులపల్లి గ్రామానికి చెందిన రమేశ్​, పుష్ప భార్యభర్తలు. ఇద్దరు.. గొడవ పడి ఐదు నెలల క్రితం తన ఆరేళ్ల కూతురు భవానిని తీసుకుని భార్య ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు సాయి, సరయు తండ్రి వద్దే ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉన్నట్లుండి పిల్లలు కనిపించకుండా పోయారు. తెలిసిన చోట వెతికినా ఎక్కడా కనిపించలేదు. రమేశ్​ బీడీఎల్ భానూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్యే పిల్లల్ని తీసుకెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

నా భార్యే ఎత్తుకెళ్లిందేమో..

ABOUT THE AUTHOR

...view details