పతకాలు సాధించేందుకు అడ్డదారిని ఎంచుకుంటున్నారు క్రీడాకారులు. నిషేధిత మాదక ద్రవ్యాల్ని తీసుకుని డోప్ పరీక్షల్లో విఫలం అవుతున్నారు.
డోప్ పరీక్షల్లో ఖేలో ఇండియా క్రీడాకారులు విఫలం - ఖేలో ఇండియా క్రీడాకారులు
భారత అథ్లెట్లు మరోసారి మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తేలింది. ఇటీవల జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొన్న తొమ్మిది మంది క్రీడాకారులు డోప్ టెస్టుల్లో విఫలమయ్యారు.
![డోప్ పరీక్షల్లో ఖేలో ఇండియా క్రీడాకారులు విఫలం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2754103-931-bcb8a309-11a4-42b8-ae43-220b6bca6c47.jpg)
డోప్ పరీక్షల్లో విఫలమైన ఖేలో ఇండియా క్రీడాకారులు
జనవరిలో రెండో విడత ఖేలో ఇండియా పోటీలు జరిగాయి. అందులో పాల్గొన్న సూమారు 476 మంది శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహించింది నాడా(జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ). అందులో పలు క్రీడ్లలో పాల్గొన్న 9 మంది క్రీడాకారులు డోప్ పరీక్షల్లో విఫలమయ్యారు.
అర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లలో 9 మంది క్రీడాకారుల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ స్థాయిలు పెరగాయి. ఇందుకోసం నిషేధిత ఉత్ప్రేరకాలు వాడారు. వారిలో ఎక్కువ మంది రెజ్లింగ్ ఆడిన వారే కావడం విచారకరం.