తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... పలు ప్రముఖ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. రామేశ్వరంలోని అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించారు. సీఎంతో తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. స్మారక భవనంలో కలియ తిరిగిన కేసీఆర్... కలాం ఉపయోగించిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.
కలాం సమాధిని సందర్శించిన కేసీఆర్ - కలాం సమాధిని సందర్శించిన కేసీఆర్
దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ కేటీఆర్, సంతోష్ కుమార్తో కలిసి రామేశ్వరంలోని అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు.

తమిళనాడు పర్యటనలో