గత నెల 16న కరీంనగర్లో ప్రచార భేరీ మోగించిన కేసీఆర్.. 19న నిజామాబాద్ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ఖరారు ప్రక్రియ, వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. అనంతరం 29న మలిదశ ప్రచారం ప్రారంభించి పది నియోజకవర్గాల్లో పది సభల్లో పాల్గొన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి, వరంగల్, భువనగిరి, మెదక్, జహీరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.
ఈనెల 7 నుంచి కేసీఆర్ తుది విడత ప్రచారం - ఎన్నికల ప్రచారం
కేసీఆర్ మలిదశ ప్రచారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పది సభల్లో ప్రసంగించిన కేసీఆర్... భాజపా, కాంగ్రెస్‌లే లక్ష్యంగా ప్రచారం చేశారు. పదహారు స్థానాల్లో ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించారు. ఈనెల 7న నిర్మల్, 8న వికారాబాద్‌లో గులాబీ దళపతి తుది విడత ప్రచారం చేయనున్నారు.
ఈనెల 7 నుంచి గులాబీ దళపతి తుది విడత ప్రచారం
తుది విడత ప్రచారం
నేడు, రేపు కేసీఆర్ ప్రచార కార్యక్రమాలేవీ లేవు. ఈనెల 7 నుంచి తుది విడత ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 7న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సభ నిర్మల్‌లో.. ఈనెల 8న చేవెళ్ల సభ వికారాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఈనెల 9న ప్రచార సభ నిర్వహించాలని నేతలు కోరారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
Last Updated : Apr 5, 2019, 7:50 PM IST