తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'కలిసొస్తే ఎర్రకోటపై పాగావేద్దాం'.. - stalin

పార్లమెంట్‌ ఫలితాలు సమీపిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓ దఫా తనకు అనుకూల రాష్ట్రాలన్నీ తిరిగొచ్చిన ముఖ్యమంత్రి  రెండోసారి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా గతవారం కేరళ సీఎం పినరయి విజయన్‌తో  సమావేశమయ్యారు. తాజాగా చెన్నైలోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు.

kcr-meet-stalin

By

Published : May 14, 2019, 5:36 AM IST

Updated : May 14, 2019, 6:19 AM IST

కలిసొస్తే ఎర్రకోటపై పాగావేద్దాం..

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలో ఎవ్వరికీ సరైన ఆధిక్యం వచ్చే అవకాశం లేదని... ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయంటున్న కేసీఆర్​ అందుకు అణుగుణంగా ఫెడరల్​ప్రంట్​ ఏర్పాట్లను వేగంవంతం చేశారు. ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తులుగా మార్చేందుకు అవసరమైన వ్యూహరచనకోసం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్​ సమావేశమయ్యారు. చెన్నై ఆళ్వారుపేటలోని స్టాలిన్‌ నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో పరిణామాలు, ఇరుపార్టీలకు రాబోయే లోక్​సభస్థానాలు తదితర అంశాలపై చర్చించారు.

తెరాస, డీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకొస్తే దిల్లీలో అధికారం చేజిక్కించుకోవచ్చని కేసీఆర్​ వివరించారు. దాదాపు గంటా పదిహేను నిమిషాలపాటు జరిగిన సమావేశంలో స్టాలిన్​, కేసీఆర్​తో పాటు ఎంపీలు వినోద్‌, సంతోష్​తో పాటు డీఎంకే నేతలు దురైమురుగన్‌, టి.ఆర్‌. బాలు పాల్గొన్నారు.

స్పష్టత ఇవ్వని స్టాలిన్​

తమిళనాడులో ఇప్పటికే కాంగ్రెస్​, డీఎంకే మధ్య ఎన్నికల పొత్తు ఉండటం, రాహుల్​ గాంధీని ప్రధాని అభ్యర్థిగా తొలుత తానే ప్రతిపాదించడం వంటి అంశాలను స్టాలిన్​ వివరించినట్లు తెలిసింది. అందుకే సమాఖ్య కూటమిపై కేసీఆర్​కు నిర్దిష్ట హామీ ఇవ్వలేకపోయారని సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరమే కేసీఆర్​ సూచించిన ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామని స్టాలిన్​ స్పష్టం చేసినట్లు సమాచారం. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లడకుండా కేసీఆర్​ హైదరాబాద్​కు తిరుగుప్రయాణమయ్యారు. డీఎంకే నేతలు కూడా మీడియాతో మాట్లాడలేదు.

ఇదీ చదవండి: నేడే చివరి దశ ప్రాదేశిక పోరు...

Last Updated : May 14, 2019, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details