రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు చేరుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. ముందుగా కేసీఆర్ గన్నవరం విమానాశ్రయం నుంచి గేట్ వే హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్‌తో కలిసి వైకాపా అధినేత ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అనంతరం దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గులాబీ అధినేత పాల్గొననున్నారు.
విజయవాడకు చేరుకున్న కేసీఆర్ - MODI
జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరిన ఆయన బెజవాడ చేరారు.
విజయవాడకు కేసీఆర్ పయనం
Last Updated : May 30, 2019, 11:19 AM IST