'మాటమీద ఎవరుంటారో ప్రజలకు తెలుసు' - మాటమీద ఎవరుంటారనేది ప్రజలకు తెలుసు: కేసీఆర్
సారు.. కారు... పదహారు నినాదంతో ముందుకెళ్తున్న తెరాస ప్రచార జోరుని పెంచింది. మహబూబాబాద్ సభకు హాజరైన కేసీఆర్ కాంగ్రెస్‌పార్టీపై మండిపడ్డారు. వారి ఎన్ని మాటలు చెప్పినా... మాటమీద ఎవరుంటారనేది ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
మాటమీద ఎవరుంటారనేది ప్రజలకు తెలుసు: కేసీఆర్
రెండు లక్షల రుణమాఫీ అన్నప్పటికీ కాంగ్రెస్‌ను రైతులు నమ్మలేదని సీఎం కేసీఆర్ మహబూబాబాద్ బహిరంగ సభలో ఎద్దేవా చేశారు. మాటమీద ఎవరుంటారనేది ప్రజలకు తెలుసాని స్పష్టం చేశారు. భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిస్తామని హామీనిచ్చారు. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామని తెలిపారు. నెహ్రూ కాలం నుంచి పేదరికాన్ని పారదోలుతామని కాంగ్రెస్ నేతలు చెప్పడం తప్ప చేసిందేమి లేదని మహబూబాబాద్ సభలో విమర్శించారు.
Last Updated : Apr 4, 2019, 8:26 PM IST