శుభాకాంక్షల ట్వీట్ - kavitha
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ కవిత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. అతివలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగాను వృద్ధి సాధించాలని సీఎం ఆకాంక్షించారు. మహిళలను పూజించే గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు మనదగ్గర ఉన్నాయని పోచారం కొనియాడారు. మహిళల దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు వారికి సమాన హక్కులు కల్పించేందుకు కృషిచేద్దామని కవిత ట్వీట్ చేశారు.