తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కరణ్ జోహర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ - కరణ్ జోహార్

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్​ జోహర్ తన​ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్​లో తానే ఆవిష్కరించాడు. ఒక భారతీయ ఫిల్మ్ మేకర్​కు ఈ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి.

మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్​లో కరణ్ జోహార్ మైనపు విగ్రహం

By

Published : Apr 4, 2019, 10:26 AM IST

కరణ్ జోహర్.. బాలీవుడ్​లో ప్రముఖ దర్శక నిర్మాత. ప్రేక్షకుల మదిలో నిలిచే ఎన్నో చిత్రాలను తెరకెక్కించాడు. హిందీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా అతడికి అరుదైన గౌరవం లభించింది. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్​లో కరణ్ మైనపు విగ్రహాన్ని నెలకొల్పారు. కుటుంబ సమేతంగా వెళ్లి ఆవిష్కరణలో పాల్గొన్నాడీ దర్శకుడు.

తన మైనపు విగ్రహంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్

8 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి ఈ మ్యూజియంకు వచ్చానని కరణ్ చెప్పాడు. ఆ సమయంలో ఎంతో ఆనందంగా గడిపానని గత స్మృతులు నెమరవేసుకున్నాడు.

ఈరోజు నా మైనపు విగ్రహం ఈ మ్యూజియంలో ఓ భాగమైంది. ఇలాంటి గౌరవం దక్కడం నాకెంతో గర్వకారణం -కరణ్ జోహర్, బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details