పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో కాళేశ్వరంలో ఆరో ప్యాకేజీ పంప్ హౌస్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఉదయమే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి.. ఎల్లంపల్లి నుంచి నంది మేడారం వరకు నిర్మాణాలను పరిశీలించారు. భూగర్భంలోని విద్యుత్ ఉపకేంద్రం, సర్జిపూల్, డెలివరీ సిస్టర్న్, లీడ్ కెనాల్, నంది మేడారం జలాశయాలను సందర్శించారు. నిర్మాణ విశేషాలను, పంప్‌హౌస్ పనితీరును నీటిపారుదలశాఖ ఈఈ శ్రీధర్ మంత్రికి వివరించారు. ప్రత్యేక పూజల అనంతరం కంప్యూటర్‌తో పంప్‌హౌస్‌ను ప్రారంభించారు.
కాళేశ్వరం ఆరో ప్యాకేజీ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
పెద్దపల్లి జిల్లా నంది మేడారంలో కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పంప్‌హౌస్‌ను రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మొదట ప్రాజెక్ట్ పరిసరాలు, ఇతర నిర్మాణాలను పరిశీలించిన మంత్రి ప్రత్యేక పూజల చేసిన తర్వాత కంప్యూటర్ ద్వారా పంప్‌హౌస్‌ను ప్రారంభించారు.
కాళేశ్వరం ఆరో ప్యాకేజీ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి