బాలీవుడ్లో మరో భారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. అగ్ర తారలు వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న 'కళంక్' ట్రైలర్ విడుదలైంది. ఇతర కీలక పాత్రల్లో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ కనిపించనున్నారు.
భారీతనం ఉట్టిపడుతున్న 'కళంక్' ట్రైలర్ - varun dhawan
వరుణ్ ధావన్,ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'కళంక్' ట్రైలర్ విడుదలైంది. భారీతనంతో నిండిన ప్రతి ఫ్రేం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
భారీతనం ఉట్టిపడుతున్న 'కళంక్' ట్రైలర్
1945ల నాటి కథతో సినిమా తెరకెక్కింది. పూర్తి స్థాయి ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రానికి అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. వేసవి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు.. ఏప్రిల్ 17న విడుదల కానుంది.
ఇవీ చదవండి: