కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో దొంగతనం జరిగింది. సీతాపతిరోడ్లోని త్రినేత్ర శివాలయం సమీపంలో నివాసముంటున్న పంజాల భూలక్ష్మి... 20రోజుల క్రితం హైదరాబాద్‌లోని తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం కుటుంబసభ్యులంతా ఇంటికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం తెరిచి ఉండటం చూసి కంగారు పడ్డారు. లోనికి వెళ్లి పడక గదిలో చూడగా... బీరువాల తలుపులు తెరిచి, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దొంగలు పడ్డారని గ్రహించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. రూ.10 వేల నగదు, 3తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు పోయినట్లు బాధితులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కొడుకు దగ్గరికి వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల - kagaznagarlo-chori1
హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉందామని వెళ్లింది. వేసవి కావటం వల్ల మళ్లీ అందరూ కలిసి స్వగ్రామానికి వచ్చారు. కానీ వచ్చేసరికి ఉన్నదంతా దొంగలు ఎత్తుకెళ్లారు.
విస్తుపోవటం కుటుంబసభ్యుల వంతైంది