తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జూడోలో బంగారు పతకం

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు నేపాల్​లో జరిగిన అంతర్జాతీయ జూడో పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించాడు.

జూడోలో బంగారు పథకం

By

Published : May 9, 2019, 7:53 PM IST

Updated : May 10, 2019, 9:52 AM IST

జూడోలో బంగారు పథకం

సౌత్ ఏషియన్ అండర్- 19 విభాగంలో జాతీయ స్థాయిలో జూడో పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరచి బంగారు పతకం సాధించాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఉత్తేజ్. నారాయణఖేడ్​ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలం చీమలపాడుకు చెందిన లలిత, విఠల్ కుమారుడు ఉత్తేజ్. హైదరాబాద్​లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

ఈనెల 4 నుంచి 8 వరకు నేపాల్​లో జరిగిన అంతర్జాతీయ జూడో పోటీలో సత్తా చాటి బంగారు పతకం సాధించాడు. నారాయణఖేడ్ కీర్తిప్రతిష్టలు పెంచాడని.. మరిన్ని విజయాలు సాధించి ఖేడ్​ను జాతీయ స్థాయిలో నిలపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: కలాం సమాధిని సందర్శించిన కేసీఆర్​

Last Updated : May 10, 2019, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details